1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Adire Adire| Cinema| Logo| Release| Rammohan Reddy| Charan Babu | "అదిరె.. అదిరే.." లోగో ఆవిష్కరణ

అదిరె అదిరే
గ్లోరియస్ మూవీ మేకర్స్ పతాకంపై "అదిరె.. అదిరే..." అనే చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్మాత ఎన్. రామ్‌మోహన్ రెడ్డి చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తనకు సినిమా రంగమంటే తనకు ఆసక్తి ఎక్కువని చెప్పారు. చక్కని ప్రేమకథను చరణ్‌బాబు అందించారని, మొదటిభాగం కాలేజీ నేపథ్యంలో, రెండోభాగం కాలేజీ ముగిసిన తర్వాత ఉంటుందన్నారు.

ఇందులో కొత్తవారిని పరిచయం చేస్తున్నామని నిర్మాత చెప్పారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి డిసెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని ఆయన వివరాలందించారు.

దర్శకుడు ఎం. చరణ్‌బాబు మాట్లాడుతూ.. ప్రేమకథతో కూడిన ఈ చిత్రాన్ని కొత్తదనంగా చూపే ప్రయత్నం చేస్తున్నామని, కమేడియన్స్ కూడా కొత్తవారిని పరిచయం చేస్తున్నామని తెలిపారు. తాను గతంలో పలు ఆల్బమ్‌లు చేశానని సంగీతదర్శకుడు సన్నీ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ కాతూరి, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం. చరణ్‌బాబు.
About Writer
SELVI.M