1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Banner

Sai Manisha| Banner| New Film| Rakesh| Ramesh| Rajesh| Jahnavi | సాయిమనీష పతాకంపై ద్విభాషా చిత్రం ప్రారంభం

సాయిమనీష
WD
సాయిమనీష సినిమా పతాకంపై ద్విభాషా చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.

కాంగ్రెస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, దర్శకులు సముద్ర, వెంకీ తదితరులు ఈ సినిమా ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకలో బేనర్ లోగోను లాంఛనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వేణుగోపాల్ పిళ్లై మాట్లాడుతూ.. ముగ్గురు యువకులు, ఓ యువతి మధ్య జరిగే ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్పారు. ఈ సినిమా ద్వారా కొత్తవారిని పరిచయం చేస్తున్నామని తెలిపారు. సంగీతం, కథ చాలా బాగున్నాయని నిర్మాత వెల్లడించారు.

దర్శకుడు రవిప్రశాంత్ టి. మాట్లాడుతూ.. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పూర్తి వినోదాత్మక చిత్రమిదని, ఆగస్టు 17 నుంచి వైజాగ్‌లో షూటింగ్ ప్రారంభించి 45 రోజుల ఏకధాటిగా చిత్రీకరణ చేస్తామన్నారు. ఈ నెల ఐదో తేదీన చెన్నైలో తమిళ వర్షన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. నవంబరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.

సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ మాట్లాడుతూ.. రవిప్రశాంత్ దర్శకత్వంలో "నా అనేవాడు" చిత్రానికి సంగీతం సమకూర్చానని, తాజా చిత్రంలో ఐదు పాటలున్నాయని వెల్లడించారు. వినోదభరితంగా సాగే ఈ సినిమా క్లైమాక్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుందని తెలిపారు.

రాజేష్, రాకేష్, రమేష్, జాహ్నవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, భానుచందర్, నాజర్, తెలంగాణా శకుంతల, రఘుబాబు తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి కథ, మాటలు: తాళ్ళపాక నాగరాజు, కెమెరా: సూర్య, సమర్పణ: సాయి-మనీష, నిర్మాతలు: వేణుగోపాల్ పిళ్ళై, ఆర్.పి. రెడ్డి.
About Writer
SELVI.M