1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Mouna Ragam| Cinema| Tanish| Madhurima| Suhasini| Nachavule | "మౌనరాగం" మొదటి షెడ్యూల్ పూర్తి!

మౌనరాగం
WD
అగ్రనిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, శానం నాగఅశోక్ కుమార్‌లు సంయుక్తంగా శ్రీసాయిదేవా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై, "నచ్చావులే" హీరో తనీష్ కథానాయకుడిగా "మౌనరాగం" చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

జూలై 2న ప్రారంభమైన ఈ చిత్రం 27వరకూ మొదటి షెడ్యూల్‌ను జరుపుకుంది. దీనికి సంబంధించిన రెండో షెడ్యూల్ ఆగస్టు ఆరో తేదీ నుంచి ప్రారంభం కానుంది.

చిత్ర నిర్మాతలలో ఒకరైన శానం నాగ అశోక్ కుమార్ "మౌనరాగం" మొదటి షెడ్యూల్ వివరాల్ని తెలుపుతూ... ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్‌ని అల్యూమినియం ఫ్యాక్టరీ, జూబ్లీహిల్స్‌లోని కోకో పబ్, రామోజీ ఫిలింసిటీలోని ఎయిర్‌పోర్ట్ సెట్‌లో తీశామన్నారు. అదేవిధంగా కొన్ని రైల్వేట్రాక్ సీన్స్‌, శంకరం పల్లిలో మరికొన్ని దృశ్యాల్ని చిత్రీకరించామని తెలిపారు.

అలాగే రామానాయుడు స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌వేసి కొన్ని సీన్స్‌ను షూట్ చేశామని తెలియజేశారు. ఇకపోతే.. రెండో షెడ్యూల్‌ని ఆగస్టు ఆరో తేదీన మొదలు పెట్టి టాకీ మొత్తం భాగం పూర్తి చేస్తామని నిర్మాత వెల్లడించారు.

యంగ్ హీరో తనీష్ సరసన మధురిమ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చంద్రమోహన్, సుహాసిని, భూపాల్, ప్రసాద్ బాబు, అలీ, జీవా, ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ, సూర్య, కె.ఎల్. ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్, కెమెరా: షమన్ మిత్రు, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: రాజీవ్ నాయర్, కాస్ట్యూమ్స్: శ్రీను, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ బాలాజీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీనివాస్ కోట.
About Writer
SELVI.M