1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Money

Sharukh Khan | Money | Expences | Investments | బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మనీ ఫార్ములాస్

షారుక్ ఖాన్
FILE
డబ్బుకోసం షారుక్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడట. స్వానుభవంతో తెలుసుకున్నవి కొన్నైతే తన తల్లి డబ్బు విలువ ఎంతటిదో షారుక్ కు అనేక సందర్భాల్లో చెప్పిందట. డబ్బును తను ఎలా ఖర్చు చేస్తాడో.. ఎలా పొదుపు చేస్తాడో.. ఇలా వివరించాడు. " నేనెప్పుడూ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయను. అయితే నేను ఇంటి బయటకు వెళ్లేటపుడు జేబులో వేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తాను.

నా మనసు ఎంతో సున్నితమైంది. ఎవరైనా డబ్బుకోసం చేయి చాచితే డబ్బును ఇచ్చేస్తా. అలా ఇచ్చేసిన తర్వాత నా చేతిలో డబ్బు ఉండదు. మళ్లీ ఏదైనా అవసరం రావచ్చేమోనని నా స్పాట్ బాయ్ దగ్గరో లేదంటే నా డ్రైవరు దగ్గరో అప్పు తీసుకుంటా.

ఇంకో విషయం.. నా వద్ద చాలా క్రెడిట్ కార్డులు ఉంటాయి. కానీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించను. క్రెడిట్ కార్డులు తెచ్చే ఇబ్బందులు మా స్నేహితుని ద్వారా తెలుసుకున్నాను. అందుకే అవి వున్నా.. వాటిని మాత్రం ఉపయోగించను. ఇక నా పెట్టుబడుల విషయానికి వస్తే.. నాకు షేర్లలో డబ్బును పెట్టుబడి పెట్టే అలవాటు లేదు. అలాగే డబ్బును వడ్డీలకు ఇవ్వను. అప్పు చేయను. నేను కొన్న బిల్డింగే నాకు పెద్ద పెట్టుబడి. అదే నా స్వేదం. నా రక్తం.. నా కన్నీరు.

'డబ్బు అప్పు చేయవద్దు. ఎల్లప్పుడూ డబ్బు ఇవ్వగల స్థానంలో ఉండాలే తప్ప ఎవర్నీ అడిగే స్థాయిలో ఉండకూడదు' అని మా అమ్మ చెప్పిన మాటలు ఎప్పుడూ నాకు గుర్తుంటాయి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT