1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Nitin

Adavi | Nitin | Srikalahasti | Ramgopal Varma | Priyanka Kothari | "అడవి"కోసం శ్రీకాళహస్తీశ్వరునికి నితిన్ పూజలు

అడవి
WD
సిక్స్ ప్యాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే యత్నం చేసి ఆనక ఏకంగా రామ్‌గోపాల్ వర్మ దృష్టిలో పడి "అడవి" హీరోగా అవతారమెత్తిన స్ట్రాంగ్ హీరో నితిన్. అడవిలో ప్రియాంక కొఠారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా తన లాంగ్వేజ్‌ను మార్చుకుని మాస్‌ను మజా చేయడానికి రానున్నాడు. ఇక రామ్‌గోపాల్ వర్మ తారలను ఏ రేంజ్‌లో చూపిస్తారో వేరే చెప్పనక్కర లేదు.

ఈ సంగతి ప్రక్కనపెడితే, మన తెలుగు హీరో నితిన్ "అడవి" అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటూ శ్రీకాళహస్తీశ్వరునికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించాడు. హీరో ఒక్కడే వచ్చాడు.. మరి హీరోయిన్ పూజలు చేయలేదా.. అనుకునేరు. ప్రియాంక కొఠారి కూడా అడవి సూపర్ డూపర్ హిట్టవ్వాలని తన ఇష్టదైవాన్ని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్లు బాలీవుడ్ వార్త.

"అడవి"ని రూపొందించిన రామ్‌గోపాల్ వర్మ ఎలాగూ సినీ ప్రారంభంలోనే పూజలు నిర్వహించారు కనుక ఇప్పుడంతా ఆయన రక్త చరిత్ర గురించి యోచిస్తున్నారట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT