3D Animation| Sri venkateswara| Suprabhatam| Album | యానిమేషన్‌లో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
WD
సైబర్ విలేజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ఈ ఆల్బమ్ గురించి ఆ సంస్థ అధినేత పెండ్యాల రాంబాబు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. త్రీడు యానిమేషన్ సుప్రభాతంను రూపొందించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అన్నారు. త్వరలో ఆధ్యాత్మికతకు చెందిన 11 ఆల్బమ్‌లను త్రీడీ యానిమేషన్ వీడియోలుగా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని కృష్ణవేణి మాట్లాడుతూ.. సుప్రభాతాన్ని చూస్తే ఆస్వాదించే ప్రక్రియ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. 30 నిమిషాల నిడివిగల ఈ ఆల్బమ్ ఈనెల 21న మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.