1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Adavi

RamGopal Varma| Adavi| Cinema| Nitin| Priyanka Kothari| Image | రామ్‌గోపాల్ వర్మ "అడవి"తో నా ఇమేజ్ పై.. పైకి..!

రామ్గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తాజాగా రూపుదిద్దుకున్న "అడవి" చిత్రం తన ఇమేజ్ పెంచుతుందని నిర్మాత నట్టికుమార్ నమ్మకం వ్యక్తం చేశారు. రామ్‌గోపాల్ వర్మ చిత్రాలను తెలుగులో రిలీజ్‌చేయడానికి పోటీ ఉంటుంది. అటువంటి పోటీ "అడవి" చిత్రానికి కూడా ఉన్నదని నట్టికుమార్ అన్నారు. 

కానీ తాను నమ్మకంతో అడవి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నించానని, మొదట తనకీ సినిమా ఇవ్వడానికి వర్మ ససేమిరా అన్నా.. ఆ తర్వాత తన పనితీరును గురించి తెలుసుకుని అడవిని తెలుగులో రిలీజ్ చేసే అవకాశాన్ని తనకిచ్చారని నట్టికుమార్ వెల్లడించారు.

ఆ అవకాశం తనకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, వర్మ ఛాన్సిచ్చిన రోజును తన జీవితంలో మర్చిపోలేనని మంగళవారం విలేకరులతో నిర్మాత తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో "అడవి" చిత్రాన్ని 130 ప్రింట్లతో విడుదల చేస్తున్నామని చెప్పారు. క్యూబ్-యు, ఎఫ్.ఓలను కలిపి 80 థియేటర్లు కాగా, మొత్తం 220 థియేటర్లలో వర్మ అడవి రిలీజ్ అవుతుందని ఆయన వివరాలందించారు.

ఈ చిత్రాన్ని తీసుకోవడానికి వర్మ దర్శకత్వంతో పాటు నితిన్, ప్రియాంక కొఠారిలు ఇందులో నటించడం మరో కారణమని నట్టికుమార్ అన్నారు. అందరూ తెలుగువారే కాబట్టి, కమర్షియల్‌గా ఇమేజ్‌ను పెంచే చిత్రమవుతుందని ఆశించారు.

ఈ సినిమా కోసం ఒక్కో ఏరియాకు 4, 5 థియేటర్లు పోటీచేశారంటే సినిమా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. శ్రీలంకలో ఈ చిత్రాన్ని ధైర్యంగా తీసిన ఘనత వర్మకే దక్కుతుందని, ఆడియో వేడుకలో చెప్పినట్లుగానే "అడవి" వందరోజుల వేడుకల్లో అడుగుపెడుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
About Writer
SELVI.M