Telugu cinema Tadaka| Shooting| Aditya Om| Dinesh| Sunayana| Roopa Kaur | తడాఖా సినిమా షూటింగ్ ప్రారంభం
WD
ముహూర్తపు షాట్‌కు కోడి రామకృష్ణ క్లాప్ ఇవ్వగా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పి.సి.రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
రెండు షెడ్యూల్స్‌లో "తడాఖా"ను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఓబుల్ రెడ్డి అన్నారు. పూసల రాధ చెప్పిన కథ చాలా బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నానని, "భోజ్‌పురి" సూపర్ స్టార్స్ అయిన దినేష్, సునయనను కథానాయికగా పరిచయం చేస్తున్నామని నిర్మాత తెలిపారు. వీరందరూ కచ్చితంగా తమ "తడాఖా" చూపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
దర్శకుడు పూసల రాధ మాట్లాడుతూ.. భోజ్‌పురి చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా మీకు తెలుగులో సినిమా చేసే ఆలోచన వుంటే నాకు చెప్పండి అన్నాను. సరిగ్గా సంవత్సరం తరువాత తడాఖా కథ విని భోజ్‌పురి తారలు ఇందులో నటిస్తున్నారని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు జీవి, కెమెరా మెన్ మోహన్ చంద్, డ్యాన్స్ మాస్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు.
