Mahesh Babu | Birthday | Cinema | | నేడు ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినోత్సవం
File
FILEమహేష్ బాబు చేసిన సినిమాల్లో 'మురారీ', 'ఒక్కడు', 'పోకిరి', చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో "వరుడు" చిత్రంలో నటిస్తున్నారు. మహేష్ బాబు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
10 యేళ్ల క్రితం "రాజకుమారుడు"గా హీరోగా పరిచయమైన ఈ యువహీరో పద్నాలుగు చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాల్లో అద్భుత నటనను ప్రదర్శించారు. ఫలితంగా ఆరు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కాలను దక్కించుకున్నారు.