1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Vangapandu

Magadheera | Vangapandu | Allu Aravind | "మగధీర" పాటపై అల్లు అరవింద్ ఇంటి ముందు వంగపండు

మగధీర
తాను రాసిన 'ఏ పిల్లో ఎల్దమొస్తవా...' అనే పాటను మగధీర చిత్రంలో అసభ్యకర సన్నివేశంలో వాడడంపై విప్లవ రచయిత వంగపండు ప్రసాదరావు ఆక్షేపించారు. ఆ సన్నివేశంలో ఉన్న పాటను వెంటనే తొలగించాలనీ చిత్ర నిర్మాత అల్లుఅరవింద్‌ను డిమాండ్‌ చేశారు.

సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని అల్లు అరవింద్‌ ఇంటిముందు తన కళాకారులతో ప్రదర్శనగావచ్చి తన నిరసన తెలిపారు. తన డిమాండ్‌ను అమలు చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తేల్చిచెప్పారు.

ఈ వివాదంపై అల్లు అరవింద్‌కు వంగపండుకు సయోధ్య కుదిరిందన్న విషయాన్ని ఆయన త్రోసిపుచ్చారు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT