Yugala Geetam | Sreekar | Arti Poori | Abhishek | టీనేజ్ నేపథ్యంతో సాగే ''యుగళ గీతం''
WD
శ్రీకర్, అభిషేక్, చందు, శివ ముప్పాళ్ళ, సోనిచరిష్టా, సబ్రినాహస్మి, లక్ష్మీచంద్రిక, అనూషలపై ఆ పాటలను స్వర్ణ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు. ఈనెల 20వరకు జరిగే షూటింగ్‌తో పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. 24న ఆడియోను విడుదలచేసి దసరా నాటికి సినిమాను విడుదలచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ..'కాలేజీ నేపథ్యంలో సాగే చిత్రమిది. విద్యార్థి జీవితం చాలా కీలకమైనది. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. లేదంటే వేసే తప్పడుగు జీవితాన్ని మార్చేస్తుంది. ఈ నేపథ్యంలో చిత్రముంటుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివాజీ.