Sivangi, Archana, Manju | తుది మెరుగుల్లో అర్చన "శివంగి"
WD
కృష్ణతోట మాట్లాడుతూ, "ఇంతవరకు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించాను. ఈ చిత్రానికి ముందు సందేశాత్మక చిత్రమైన మహాయజ్ఞం చేశాను. వృత్తిపరంగా తృప్తినిచ్చింది. ఈ చిత్రం రొమాంటిక్ ఓరియెంటెడ్ చిత్రమైనా అన్ని కమర్షియల్ హంగులూ ఉన్నాయి. సబ్జెక్ట్ బాగా రావడంతో స్క్రిప్ట్‌కు ఎక్కువ సమాయాన్ని కేటాయించాము" అన్నారు.
అర్చన మాట్లాడుతూ, ఈ చిత్ర కథ తనకు బాగా నచ్చిందన్నారు. నటించేందుకు మంచి అవకాశమున్న చిత్రమిదని, ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నానని, సివంగిలో తనకు ఫైట్స్ సన్నివేశాలున్నాయని ఆమె తెలిపారు.