1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Swetha Basu

Vaibhav| Swetha Basu| Kasco| Cinema| KodandaRami Reddy | "కాస్కో" అంటోన్న వైభవ్, శ్వేతబసు ప్రసాద్

వైభవ్
'గొడవ' ఫేమ్‌ హీరో కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ తాజాగా నటిస్తోన్న చిత్రానికి 'కాస్కో' అనే పేరును ఖరారు చేశారు. కె.ఫిలింస్‌ పతాకంపై జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ. భారతి నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా గురించి సమర్పకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, చిత్ర నిర్మాణం పూర్తయిందన్నారు. కథకు తగినవిధంగా కాస్కో అనే పేరు పెట్టామని చెప్పారు.

ముఖ్యంగా యూత్‌ను ఉర్రూతలూగించే ఈ చిత్రం యాక్షన్‌, ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుందని కోదండరామిరెడ్డి అన్నారు. యాక్షన్‌ హీరోగా గొడవతోనే పేరు తెచ్చుకున్న వైభవ్‌ ఈ చిత్రం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తారనే నమ్మకముందని తెలిపారు.

హాస్య బ్రహ్మ, బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, సెప్టెంబర్‌లో "కాస్కో" చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర సమర్పకుడు తెలిపారు. వైభవ్, శ్వేతబసు జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రేమ్‌జీ, కెమెరా: అఖిలన్‌.
About Writer
SELVI.M