Raja| Sontha Ooru| Richa| Sunil kumar Reddy| Love Story | ''రాజా''తో "సొంత ఊరు" నిర్మాత మరో చిత్రం!
WD
"సొంత ఊరు" అనేది రాజాను దృష్టిలో పెట్టుకుని చేశామని, ఆ సినిమా షూటింగ్‌లో రాజా చెప్పిన ఓ పాయింట్‌ను ఆధారంగా కథను తయారుచేశానని నిర్మాత సునీల్‌కుమార్ రెడ్డి తెలిపారు.
పారా మెడికల్‌కు, రేడియో జాకీకి మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రమని ఆయన అన్నారు. భావోద్వేగ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని, నగర నేపథ్యంలో చిత్రముంటుందని నిర్మాత చెప్పారు.
ఎగ్జిక్యూటివ్‌నిర్మాత రవీంద్రబాబు మాట్లాడుతూ, సాకేత్‌సాయిరాం ఇచ్చిన ట్యూన్స్ రికార్డింగ్‌లో ఉన్నాయన్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ రాజా కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.