Gopichand| Anushka| Lakshyam| Combination| Raviteja| Kick | మళ్ళీ తెరపైకి గోపీచంద్, బొమ్మాళీ కాంబినేషన్!
WD
ప్రస్తుతం కథాచర్చలు ముగింపు దశలో ఉన్నాయి. దసరానాడు చిత్రాన్ని ప్రారంభిస్తామని చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి గురువారంనాడు తెలియజేశారు.
ఆర్.ఆర్. మూవీమేకర్స్ పతాకంపై ఇటీవలే నిర్మించిన రవితేజ 'కిక్' చిత్రం విజయం సాధించింది. అలాగే "లక్ష్యం" సినిమా కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుందని అచ్చిరెడ్డి గుర్తు చేశారు.
మళ్లీ అనుష్క, గోపిచంద్ కాంబినేషన్‌లో తమ బేనర్‌పై రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రానికి మరింత క్రేజ్ వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలు త్వరలో తెలియజేస్తామని సమర్పకుడు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: వెంకట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సురేష్‌రెడ్డి.