ArundatiI AnushkaI Heroine Oriented MovieI ChandraI Nagarjuna | "అరుంధతి" బొమ్మాళీతో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం!
"అరుంధతి"గా సంచలన విజయాన్ని సాధించిన అనుష్క ప్రధాన పాత్రలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం డిసెంబర్ 11న ప్రారంభమవుతోంది.
"కింగ్" నాగార్జున పర్సనల్ మేకప్‌మేన్ చంద్ర నిర్మాతగా మారి సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఉత్తమ రూపశిల్పిగా సీతారామరాజు, అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు అందుకున్న చంద్ర, నిర్మాతగా సెన్సేషనల్ హిట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు.
డిసెంబర్ 11 నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్‌తో నిర్మాణం పూర్తవుతుందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రంలో నటించే మిగిలిన తారాగణాన్ని, సాంకేతిక వర్గాన్ని అతి త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు.
"అరుంధతి" కనీవిని ఎరుగని అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో... అనుష్కతో చంద్ర నిర్మిస్తున్న చిత్రానికి ఆల్‌రెడీ బయ్యర్స్ నుండి భారీ ఆఫర్స్ రావడం విశేషం
