Kalyan RamI HansikaI NTR ArtsI HareRamI Desamuduru | చివరి షెడ్యూల్‌లో కళ్యాణ్ రామ్, హన్సికల చిత్రం
WD
"అతనొక్కడే", "హరేరామ్" వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై వస్తోన్న ఈ హ్యాట్రిక్ ఫిలిమ్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన "దేశముదురు" ఫేమ్ హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా నరేన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్, హన్సిక, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి బ్రహ్మానందం తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ-మాటలు: బి.వి.ఎస్. రవి, సంగీతం: థామస్ ఎస్, ఫోటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రాజీవ్ నాయర్, సమర్పణ: మాస్టర్ నందమూరి శౌర్యారామ్, నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరేన్.