1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Aishwarya Rai

Amitabh Bacchan | Aishwarya Rai | BIG B | Swain Flu | Fever | | ఐశ్వర్యకు స్వైన్ ఫ్లూ లేదు: మీడియా రభసపై అమితాబ్ గుస్స

బాలీవుడ్
FILE
బాలీవుడ్ ప్రముఖ నటి, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు స్వైన్ ఫ్లూ సోకలేదని, కేవలం జ్వరంతోకూడుకున్న జలుబుతో బాధపడుతోందని బిగ్ బీ మీడియాకు మంగళవారం స్పష్టం చేశారు.

బాలీవుడ్ ప్రముఖ నటి, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు స్వైన్ ఫ్లూ సోకిందని మీడియా తెగ ఊదరగొడుతున్న తరుణంలో ఆమె మామగారైన ప్రముఖ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యకు స్వైన్ ఫ్లూ లేదని తేల్చి చెప్పారు. ఇదంతా మీడియా సృష్టని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా వస్తున్న మీడియా వార్తలను తాను ఖండిస్తున్నానని, ఆమె కేవలం జ్వరంతోకూడుకున్న జలుబుతో బాధపడుతున్నారని బిగ్ బీ ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని ఆయన తెలిపారు.

ఐశ్వర్య ఆరోగ్య పరిస్థితిని మీడియా అంతగా ప్రచారం చేయాల్సిన పని లేదని అమితాబ్ తన బ్లాగులో రాసుకున్నారు. పలు టీవీ ఛానెళ్ళు, వార్తా పత్రికలలో ప్రధానంశాలుగా ప్రచారం చేశాయని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం పలు మీడియా సంస్థలు తమ ఛానెళ్ళలో ప్రముఖ వార్తలకోసం పరితపిస్తున్నాయని, ఇందులో వారికి అందిన సమాచారంతో పుంఖాను పుంఖాలుగా సమాచారాన్ని ఉన్నదీ లేనిదీ కల్పించి చెపుతున్నాయని ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు.

ఐశ్వర్యకు స్వైన్ ఫ్లూ సోకలేదని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆమె రేపు లేదా ఎల్లుండి తన పనులతో బిజీ అవుతారని పేర్కొన్నారు. ఐశ్వర్య మరో వారం రోజులపాటు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని తాను కోరుకుంటున్నానని ఆయన తన బ్లాగులో రాసుకున్నారు.
About Writer
Gulzar Ghouse