1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Priyanka Chopra

Kaminy | Priyanka Chopra | Swain Flu | UTV | Bollywood | Box Office | Love Aaj Kal | "కమీనే"ను చూసి స్వైన్ ఫ్లూ భయపడింది

కమీనే
IFM
"కమీనే"ను చూసి స్వైన్ ఫ్లూ భయపడింది. నిజమండీ... యూటీవీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పూనా మరియు ముంబై ప్రాంతాలలో స్వైన్ ఫ్లూ భయంతో విడుదలకాకపోయినప్పటికీ దేశంలోని ఇతరచోట్ల విజయవంతంగా ప్రదర్శించబడింది. గత వారపు చివరి మూడు రోజులలో ఈ చిత్రానికి చెందిన కలెక్షన్లు భారీగానే నమోదైనట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ చిత్రం విడుదలైన ప్రతి సినిమా థియేటర్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఇప్పటివరకూ దాదాపు రూ 17 కోట్ల నుంచి రూ 19 కోట్ల వరకూ వసూలు చేసింది. ప్రస్తుతం " లైఫ్ పార్ట్‌నర్ " చిత్రం కూడా మంచి కలెక్షన్లను అందిస్తోంది. కమీనే చిత్రంతోపాటుగా విడుదలైన ఈ సినిమా దాదాపు ఆరు కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆగస్టు నెల 14 నుంచి 16వ తేదీల మధ్యలో విడుదలైన సినిమాలు బాక్సాఫీసు వద్ద దాదాపు 29 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

గత శుక్రవారం నుంచి ఆదివారంలోపు విడుదలైన సినిమాలపై స్వైన్ ఫ్లూ ప్రభావం ఏమంతగా చూపించలేదు. స్వైన్ ఫ్లూ మహమ్మారి కారణంగా సినిమా అంతగా ఆడదని బాలీవుడ్ సినీ జనాలు చెప్పుకున్నారు. కాని ముఖ్యంగా కమీనే చిత్రంపై స్వైన్ ఫ్లూ ప్రభావం ఏమంతగా లేదు.

స్వైన్ ఫ్లూతో కొత్త సినిమాల విడుదలలో జాప్యం జరుగుతుందని, తమ వ్యాపారం అంతంతమాత్రంగానే ఉండొచ్చని తాము భావించామని, కాని స్వైన్ ఫ్లూ ప్రభావం కొత్త సినిమాలపై ఏమంతగా చూపలేదని 13 పట్టణాలలో 26 మల్టీప్లెక్స్ సినిమాహాళ్ళను నడుపుతున్న పీవీఆర్ సినిమాకు చెందిన సీఈఓ అమితాబ్ వర్ధన్ అన్నారు. ప్రతి సినిమా ఆటకు దాదాపు 85 శాతం హాలు నిండిందని, ఇది తాము ఊహించిన దానికంటే ఎక్కువేనని ఆయన ఆనందం వెలిబుచ్చారు.
About Writer
Gulzar Ghouse