1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. High School

Kiran Rathod| High School| Aishwarya Films| Mallanna| Italian Cinema | "హైస్కూల్" అబ్బాయితో ప్రేమలో పడిన కిరణ్ రాథోడ్!

కిరణ్రాథోడ్
సెక్సీబ్యూటీ కిరణ్‌రాథోడ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రానికి 'హైస్కూల్‌' అనే పేరును ఖరారు చేశారు. 

ఐశ్వర్య ఫిలిమ్స్‌ పతాకంపై మల్లన్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరసింహనంది దర్శకుడు. ఇప్పటికే తొలిషెడ్యూల్‌‌ను పూర్తి చేసుకున్న హైస్కూల్ సినిమా గురువారం నుంచి రెండవ షెడ్యూల్‌‌లోకి అడుగుపెట్టింది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఈ సినిమాలోని ఐదు పాటల్లో మూడింటిని చిత్రీకరించామన్నారు. 30 సంవత్సరాల అమ్మాయి 13 సంవత్సరాల అబ్బాయి మధ్య సాగే రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటివరకు ఎవరూ టచ్‌చేయని పాయింట్‌ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారని నిర్మాత అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, 'మలిన్‌' అనే ఇటాలియన్‌ సినిమా ఈ చిత్రానికి ఆధారం. మన నేటివిటీకి తగినట్లుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి చదువుతున్న అబ్బాయిగా కార్తీక్‌ నటిస్తున్నాడు.

ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాలో వల్గారిటీ ఉండదు. ఆద్యంతం ఈ సినిమాలోని సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తాయని దర్శకుడు వెల్లడించారు. చిన్నపాటి సందేశంకూడా ఇందులో ఇమిడి ఉందని, రెండవ షెడ్యూల్ వచ్చేనెల 7వ తేదీ వరకు కొనసాగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్‌లో సినిమాను విడుదలచేస్తున్నామని ఆయన తెలిపారు.

ఇంకా ఈ చిత్రానికి సంగీతం: సాకేత్‌ సాయిరామ్‌, కెమెరా: కళ్యాణ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నరసింహనది.
About Writer
SELVI.M