Sankham| Gopichand| Trisha| Audio| Shiva| Prabhas | గోపిచంద్, త్రిషల "శంఖం" ఆడియో విడుదల
WD
పెద్ద శంఖంలో ఆడియో కేసెట్లు ఉంచి వాటిలోని ఒక్కొక్కటిని వినూత్నంగా ఆవిష్కరించారు. వినాయక్ ఆడియో క్యాసెట్‌ను, ప్రభాస్ సీడీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. "శంఖం" ట్రైలర్ చూశాను. సినిమా త్వరగా చూడాలనేట్లుగా ఆ ట్రైలర్ ఉందని చెప్పారు. గోపిచంద్ మా దర్శకులందరికీ నచ్చినవాడు.
ఎందుకంటే..? దర్శకుడైన టి.కృష్ణ కుమారుడు కాబట్టి. అంతేకాదు.. ఆయన ప్రవర్తనలో కూడా అందరినీ మెప్పించాడని వినాయక్ కితాబిచ్చాడు. "సాంబ" సినిమాకు శివ కెమెరామెన్‌గా పనిచేశాడు. శివకు గోపితో చేసే రెండో సినిమా ఇదని ఆయన వెల్లడించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఇలా మాట్లాడారు.
శ్రీశ్రీ విప్లవ శంఖం: పోకూరి బాబూరావు.. శ్రీశ్రీ కవితలోంచి వచ్చిన వేయిగొంతుల విప్లవశంఖంలా ఈ చిత్రకథ ఉందన్నారు. గోపిచంద్ కథకు సరిగ్గా సరిపోయాడని ప్రశంసించారు.
మరోవైపు.. గోపిచంద్, శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన "శౌర్యం"లో ఒక సున్నా ఉంటేనే వందరోజులు ఆడింది. మరి "శంఖం"లో రెండు సున్నాలున్నాయి. అంటే 200 రోజులు ఆడుతుందని వి.ఎన్.ఆదిత్య ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇకపోతే.. మామూలుగా బూరలూదినట్లు ఊదితే శంఖంలో శబ్ధం రాదు. దాన్ని ఊదాలంటే గుండెలో దమ్ముకావాలి. ఆ దమ్ము ఈ చిత్రకథకు ఉందని, దానిని ఊదింది దర్శకుడు శివ. చేసింది గోపీచంద్ అని నటుడు ఎల్.బి.శ్రీరామ్ ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇందులో తాను మంచి పాత్ర పోషించానని శ్రీరామ్ అన్నారు.
ఈ చిత్రాన్ని పుల్లారావు, జె.భగవాన్‌లు చేయగలరా? లేదా అనే అనుమానం మొదట్లో వచ్చిందని, ఎందుకంటే కథ డిమాండ్‌ను బట్టి భారీగా ఖర్చుచేయాలి. ఆ విషయమై చాలాసార్లు వారిని అడిగాను. వారు మారుమాట్లాడకుండా భారీగానే ఖర్చు పెట్టారని హీరో గోపించంద్ చెప్పారు.
శివతోనే రెండవ సినిమా చేయడానికి కారణం కథ నచ్చడమేనని, సంగీత దర్శకుడు తమన్ మంచి సంగీతం అందించారని గోపిచంద్ అన్నారు. ఇందులో ఏడు పాటలున్నాయని ఆయన తెలిపారు.