1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Anil Deerubai Ambani

Reliance| Anil Deerubai Ambani| Big Cinema| Anantapur| Multiflex| Malaysia| USA | అనంతపూర్‌లో తొలి మల్టీఫ్లెక్స్ ప్రారంభం

అనంతపూర్
రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్‌కు చెందిన బిగ్ సినిమాస్ అనంతపూర్‌లో మొదటి మల్టీఫ్లెక్స్ ప్రారంభించింది.

దేశవ్యాప్తంగా 85 ప్రాంతాలతో పాటు యుఎస్ఎ, మలేషియా, నెదర్లాండ్‌లో 457 స్క్రీన్‌లతో సినీ ప్రేక్షకులకు బిగ్ సినిమా చేరువైంది.

యాడ్‌ల్యాబ్స్ ఫిలింస్ ఆధ్వర్యంలో రూపొందిన "తేజస్విని" అనే ఈ మల్టీఫ్లెక్స్‌ బిగ్‌సినిమాలో మూడు స్క్రీన్‌లున్నాయి.

ఈ నెల 21 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. అనంతపూర్ వాసులకు పరిచయమైన త్రివేణి, తేజస్విని, తరంగిణి థియేటర్ల స్థానంలో ఈ మల్టీఫ్లెక్స్ ఉంది.
About Writer
SELVI.M