1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. carrots

Ramya Krishna | carrots | vegetables | Cinema | పచ్చి క్యారెట్లు తింటూనే ఉంటా: రమ్యకృష్ణ

రమ్యకృష్ణ
WD
పెళ్లయిన తర్వాత కాస్త బొద్దుగా తయారైన రమ్యకృష్ణ నాజుకుదనం కోసం యత్నిస్తున్నానని చెపుతోంది. ఇందుకుగాను తన ఆహారపుటలవాట్లలో చిన్నచిన్న మార్పులు చేసుకున్నానంటోంది. ఈ సందర్భంగా రమ్య చెపుతూ.. "కూరగాయల్ని వండడం వల్ల వాటిలోని పోషక విలువలు నశిస్తాయి. నేను వీలైనంతవరకూ టొమోటో, క్యారెట్, కీరదోసల్ని పచ్చివే తింటుంటాను.

ముఖ్యంగా పచ్చి క్యారెట్లను తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారై వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరవు. కొవ్వులు అతిగా ఉండే నూనె పదార్థాలకు స్వస్తి చెప్పాను. ఫ్రైడ్ రైస్ లాంటివాటిని పూర్తిగా మానేశా. రాత్రిపూట ఆహారాన్ని కూడా మితంగా తింటున్నాను.

పగటివేళ కడుపునిండా తిని పడుకుంటే త్వరగా లావెక్కుతారు కనుక పగటివేళ అస్సలు నిద్రపోను. మొత్తమ్మీద వారానికో రోజు నాకిష్టమైనవన్నీ తినేసి మిగిలిన ఆరు రోజులు మాత్రం ఆచితూచి ఆహారాన్ని తింటాను" అని చెప్పింది రమ్య.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT