Banam| Audio| Aswini Dutt| Chandrababu Naidu| Rohit| Silver Screen| Vedika | ప్రముఖుల చేతుల మీదుగా "బాణం" ఆడియో విడుదల
WD
వైజయంతి నుండి త్రీ ఏంజిల్స్ స్టూడియోస్ పతాకంపై ప్రియాంకదత్ చలసాని, చైతన్య దంతులూరి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం "బాణం" పేరిట తెరకెక్కనుంది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణోత్సవాన్ని ఐదు న్యూస్ ఛానల్స్‌లో వినూత్నంగా జరిపారు. అయిదు ఛానల్స్‌లో అయిదుగురు ప్రముఖులు ఈ ఆడియో సీడీలను రిలీజ్‌చేసి ఒక్కోపాటను విడుదల చేయడం విశేషం. సోని మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో విడుదలైంది.
WD
ఈ సినిమాకు చెందిన తొలి ఆడియో సీడీని తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు అందించారు. మరో సీడీని మాజీ కేంద్రమంత్రి దర్శకరత్న డా. దాసరినారాయణ రావు రిలీజ్ చేసి హిందూ ప్రాజెక్ట్స్ శ్యాంప్రసాద్‌రెడ్డికి అందించారు.
అలాగే మూడో సీడీని యువరత్న బాలకృష్ణ విడుదల చేసి పారిశ్రామికవేత్త రఘురాజ్‌కు అందించారు. ఇంకా నాలుగో సీడీని యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఆవిష్కరించి "కంత్రి" దర్శకులు మెహర్ రమేష్‌కు అందించారు. ఐదో సీడిని ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రిలీజ్ చేసి పారిశ్రామికవేత్త డా. వాసుకు అందించారు.
అతిథులందరూ "బాణం" ఆడియో, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. త్రీ ఏంజిల్స్ స్టూడియో బేనర్ "బాణం"తో సెన్సేషన్ క్రియేట్ చెయ్యాలని, అశ్వనీదత్‌లాగే ఆయన కుమార్తెలు చిత్ర నిర్మాణ రంగంలో అద్భుత విజయాలు సాధించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో అశ్వనీదత్, శేషు ప్రియాంక చలసాని, చైతన్య దంతులూరి పాల్గొన్నారు.
WD
నారా రోహిత్, వేదిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో రణధీర్‌రెడ్డి, షాయాజీ షిండే, భానుచందర్, ఎ.వి.ఎస్. తదితరులు నటించారు.
వైజయంతి బేనర్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ త్రీ ఏంజిల్స్ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న తొలిచిత్రం బాణంకు అద్భుతమైన సంగీతం సమకూర్చారు.
వైజయంతి హౌస్ నుంచి వస్తోన్న బాణంకు నిర్మాత: శేషు ప్రియాంక చలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చైతన్య దంతులూరి. ఇకపోతే.. సెప్టెంబర్ 16న "బాణం" ప్రేక్షకుల ముందుకు వస్తోంది.