1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Hyderabad Biryani| Cinema| Vijay Baskar| Sudeep| B. Raju| Pavani Reddy| Sowmya| Roshini Soni | "హైదరాబాద్ బిర్యానీ" తినాలని ఆశగా ఉందా?

హైదరాబాద్ బిర్యానీ
WD
విజయభాస్కర్, సుదీప్, బి.రాజు హీరోలుగా లక్ష్మీ తిరుపతమ్మ ఫిలింస్ పతాకంపై "హైదరాబాద్‌ బిర్యాని" పేరుతో కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. పావని రెడ్డి, సౌమ్య, రోషినిసోని హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వెంకటేష్, కండపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఎం. శ్రీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై తీసిన తొలిషాట్‌కు "నా అనేవాడు" దర్శకుడు సత్యనారాయణ క్లాప్ కొట్టగా, సంగీతదర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మరోదర్శకుడు సూర్యకిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ.. యువత ఎన్నో ఆలోచనలు, ఆశయాలతో హైదరాబాద్ వస్తుంటారు. ఇక్కడ వచ్చాక ఒక్కసారైనా బిర్యానీ తినాలనుకుంటారు. అలా అనుకుని హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే సంఘటన వారి జీవితాన్నే మార్చేస్తుంది. ఈ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదభరితంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

నిర్మాతల్లో ఒకరైన వెంకట్ మాట్లాడుతూ.. రెండు రోజులు షూటింగ్ తర్వాత వచ్చేనెలలో సాగే రెగ్యులర్ షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని, డిసెంబరులో "హైదరాబాద్ బిర్యానీ"ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
About Writer
SELVI.M