1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Bumper Offer

Puri Jagannath| Bumper Offer| Sai Ram Shankar| Bindu Madhavi| Avakai Biryani | డాషింగ్ డైరక్టర్ పూరి సోదరుడి "బంపర్ ఆఫర్"

పూరి జగన్నాథ్
WD
డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా వైష్ణో అకాడమీ నిర్మిస్తున్న "బంపర్ ఆఫర్" చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది.

పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన శిష్యుడు జయరవీంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ గాయకుడు కుంచె సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రం గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత శంకర్ మాట్లాడుతూ.. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4వరకు బ్యాంకాక్‌లో 2 పాటల్ని చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. సెప్టెంబర్ 5న పూరి స్థాపించిన ఆడియో సంస్థ పూరి సంగీత్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలవుతుంది.

సెప్టెంబర్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నామని శంకర్ అన్నారు. ప్రేక్షకులకు వందశాతం ఎంటర్‌టైన్‌మెంట్ అందించే రొమాంటిక్ మాస్ ఎంటర్‌టైనర్ ఇదని ఆయన తెలిపారు. హీరో సాయిరామ్ శంకర్ న్యూలుక్‌తో కనిపిస్తున్న ఈ చిత్రంలో ఆవకాయ్ బిర్యాని ఫేం బిందు మాధవి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇకపోతే.. షాయాజీ షిండే, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, అలీ, కోవై సరళ, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, రక్ష తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: రఘు కుంచె, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, మేకప్: రవి, కాస్ట్యూమ్స్: సూర్య, పాటలు: భాస్కరపట్ల, డాన్స్: దినేష్, శోభి, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.భాస్కర్ రాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్ గణేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జయరవీంద్ర, కథ,మాటలు, నిర్మాత: పూరి జగన్నాథ్.
About Writer
SELVI.M