1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Kamal Hassan

Eenadu| Kamal Hassan| Venkatesh| Shruti Hassan| Wednesday| Logo| Trailers| Release | 29న కమల్, వెంకీల ''ఈనాడు'' లోగో-ట్రైలర్స్‌ విడుదల

ఈనాడు
WD
హిందీలో సెన్సేషనల్‌ హిట్‌ అయిన 'వెడ్నెస్‌డే' చిత్రం ఆధారంగా రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై జాతీయ నటుడు కమల్‌హాసన్‌ నిర్మించిన 'ఈనాడు' సెప్టెంబర్‌ 18న విడుదలవుతోంది.

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌, విక్టరీ వెంకటేష్‌ కలిసి నటించిన ఈ భారీ చిత్ర తెలుగు హక్కులను అమ్మ ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేత జి. కుమార్‌బాబు పొందారు.

ఈ చిత్రం గురించి పద్మభూషణ్ కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. వెడ్నెస్‌డే చిత్రం చూసి ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యానని చెప్పారు.

అందుకే తన బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించానని, తన నటనా కెరీర్‌లో ఇది మరో సెన్సేషనల్ ఫిలిమ్ అవుతుందని వెల్లడించారు. ఇందులో విక్టరీ వెంకటేష్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నట్లు కమల్ అన్నారు.

ఈనాటి సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే విధంగా "ఈనాడు" చిత్రాన్ని అద్భుతంగా తీశారని కమల్ హాసన్ వెల్లడించారు. "దశావతారం" తర్వాత "ఈనాడు" తనకు మరో విభిన్నమైన చిత్రంగా అన్ని విధాలా సంతృప్తిని కల్గిస్తోందని తెలిపారు.

విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ, సినిమాపట్ల అంకిత భావంతో పనిచేసే గ్రేట్‌ యాక్టర్‌ కమల్‌హాసన్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తప్పకుండా "ఈనాడు" మంచి విజయం సాధిస్తుందని వెంకీ ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాత కుమార్‌బాబు మాట్లాడుతూ, అగ్రహీరోలు నటించిన భారీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం రావడం ఎంతో థ్రిల్‌గా ఉందన్నారు. కమల్‌గారి కుమార్తె శృతిహాసన్‌ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ చేశారు.

ఈ నెల 29న కమల్‌, వెంకటేష్‌తోపాటు పలువురు సినీప్రముఖుల సమక్షంలో "ఈనాడు"లోగోను ఆవిష్కరించడంతో పాటు, ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తున్నామని నిర్మాత వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్‌లో "ఈనాడు" తొలికాపీని సిద్ధంచేసి, 18న సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.

పూనమ్‌కౌర్‌, భరత్‌రెడ్డి, గణేష్‌, లక్ష్మీ, శివన్నారాయణ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: మనోజ్‌సోని, దర్శకత్వం: చక్రి తోలేటి.
About Writer
SELVI.M