Sandhya| Hasini| Premiste| Annavaram| Pawan Kalyan| Lady Oriented role | "హాసిని"గా వస్తోన్న ''ప్రేమిస్తే'' ఫేమ్ సంధ్య
WD
బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. "అభి" ఫేమ్ కమలాకర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. బి.వి. రమణారెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి బి. కమలాకర్ రెడ్డి నిర్మాణ పగ్గాలు చేపట్టారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఈ సినిమాకు కోటి సంగీతం సమకూర్చగా, ఇప్పటికే ఆరు పాటలకు రికార్డింగ్ పూర్తైందని చెప్పారు.
హీరో కమలాకర్ మాట్లాడుతూ.. తాను ఇందులో హీరోను కాదని, హీరోయినే హీరోగా కనిపిస్తుందని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ.. ఏకధాటిగా అక్టోబర్ వరకు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, ఇందులోని రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు.