1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Mallanna

Vikram| Mallanna| Shreya| Tension| Happy| Shooting | మాకు టెన్షన్-ఆమెకు భలే హుషారు: విక్రమ్

విక్రమ్
WD
విలక్షణ నటుడు విక్రమ్, సెక్సీడాళ్ శ్రేయ నటించిన తాజా చిత్రం "మల్లన్న". ఈ సినిమా షూటింగ్‌లో తామెంతో టెన్షన్‌కు గురయ్యామని, కానీ శ్రేయ మాత్రం చాలా సరదాగా, హుషారుగా గంతులేసిందని మల్లన్న హీరో విక్రమ్ అన్నారు.

గురువారం హైదరాబాద్‌లో ఆయన మల్లన్న చిత్రం గురించి మాట్లాడుతూ.. కోడిపుంజు గెటెప్‌తో పాటు, ముసలివాడి గెటప్‌ కోసం చాలా టైమ్ పట్టేదని, ప్రధానంగా మెక్సికో ఎపిసోడ్ అనుకున్న టైమ్‌కు షూటింగ్ జరుగుతుందో? లేదో? అనే టెన్షన్‌లో పడ్డామని చెప్పారు.

అలాగే యాక్షన్ సన్నివేశాలు చాలా కేర్‌ తీసుకుని చేయాల్సి వచ్చింది. తనతో పాటు ఫైటర్లు కూడా ఏమీ కాకుండా ఉండాలని చివరిరోజు తెగ టెన్షన్ పడ్డారు. దానికితోడు గంటల తరబడి బస్ ప్రయాణం చికాకు తెప్పించింది.

కానీ ఆ సమయంలో శ్రేయ బస్‌జర్నీలో హిందీ పాటలు పాడుకుంటూ గడిపిందని విక్రమ్ చెప్పుకొచ్చారు. దీంతో యూనిట్ అంతా చికాకును ప్రదర్శించామని, కానీ దర్శకుడు సునీగణేషన్ ఆమె పాట మనకు టానిక్‌లాంటిదని సర్ది చెప్పారని విక్రమ్ తన అనుభవాన్ని పైవిధంగా వివరించారు.

"అపరిచితుడు" తర్వాత మళ్లీ అటువంటి కథతో సినీమా తీయాలని, జేమ్స్‌బాండ్ తరహా కథ కావాలని ఎదురుచూస్తుండగా సుశీ నాలుగు కథలు చెప్పారని విక్రమ్ అన్నారు. అవేవీ నచ్చలేదు.

అప్పుడు తనకు ఫలానా పాత్ర చేయాలని ఉందని చెప్పగానే.. మల్లన్న స్క్రిప్ట్‌ను గణేషన్ తన ముందుంచారని విక్రమ్ తెలిపారు. చాలా స్టైలిష్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకోసం టైమ్ తీసుకున్నానని ఆయన చెప్పారు.

ఈ చిత్రం చెన్నైలో మొదటిరోజు 18 థియేటర్లలో హౌస్‌ఫుల్‌తో నడిచిందని, ఆంధ్రాతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి ఓపెనింగ్స్ రావడం ఆనందంగా ఉందని విక్రమ్ తెలిపారు. డబ్బింగ్ సినిమాకు తెలుగులో ఇంత స్పందన రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రజల్లో ఎవేర్‌నెస్‌కోసమే మల్లన్న తీశాం: సుశీగణేషన్
మూడేళ్లకు ముందే అనుకున్న కథ ఇదని, మనదేశంలోని డబ్బంతా స్విస్ బ్యాంక్‌లో మూలుగుతుందని చెప్పారు. దాన్ని తిరిగి మనదేశానికి తేవాలన్నదే మా కాన్సెప్ట్. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది కూడా ఇదే.

పార్టీలకతీతంగా అందరూ స్విస్‌బ్యాంక్‌లోని డబ్బునంతా బయటకు తేవాలని పిలుపునిస్తున్నారు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారని సుశీగణేషన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
About Writer
SELVI.M