1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. King

Nagarjuna| King| Tollywood| Allari Alludu| Nenunnanu| SitaRamaRaju | శరవేగంగా "నాగార్జున" తాజా సినిమా షూటింగ్!

నాగార్జున
WD
విక్కీదాదా, అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను. కింగ్ వంటి హిట్ చిత్రాల తర్వాత టాలీవుడ్ "కింగ్" నాగార్జున కథానాయకుడిగా కామాక్షి కళా మూవీస్ పతాకంపై కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది.

ప్రముఖ నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షెడ్యూల్ ఏకధాటిగా జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. "మా మిత్రులు.. మా హీరో అయిన.." నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "కింగ్" తర్వాత మళ్లీ నాగార్జునతో నిర్మిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోందన్నారు.

ఈ చిత్రం ద్వారా కిరణ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నామని, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా డిఫరెంట్ స్టైల్‌లో మంచి ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని నిర్మాత వెల్లడించారు.

నాగార్జున సినీ కెరీర్‌లో ఇదో వైవిధ్యమైన సినిమా అవుతుందని, గోవాలో నెలరోజుల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేశామని శివప్రసాద్ రెడ్డి అన్నారు. నవంబర్ 20వరకు ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుందని, డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వివరాలందించారు.

నాగార్జునకు, తమ బేనర్‌కు మరో పెద్ద హిట్ చిత్రమిదవుతుందని, ప్రేక్షకుల్ని, నాగార్జున అభిమానుల్ని విశేషంగా అలరించే ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయని శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

"కింగ్" నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళామూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, ఫోటోగ్రఫీ: సర్వేశ్‌మురారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్కినేని వెంకటరత్నం, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కిరణ్.
About Writer
SELVI.M