Sarai Veerraju| Ajay| Madhulika| Rajamouli| Hyderabad| Narsipatnam | సెప్టెంబరులో వస్తోన్న "సారాయి వీర్రాజు" పాటలు
WD
విశాలాక్షీ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై పి.ఆర్.కె. రావు నిర్మిస్తోన్న ఈ చిత్రం 90 శాతం పూర్తయ్యింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు డి.ఎస్. కణ్ణన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. హైదరాబాద్, నర్సీపట్నం ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగిందన్నారు. రావిశాస్త్రిగారి "సారాయి కథలు" ఆధారంగా ఈ చిత్రం చేస్తున్నామని, నేటివిటీ కోసం నర్సీపట్నంలోని వారికి నటనలో తర్ఫీదు ఇచ్చి చేయిస్తున్నామని దర్శకుడు తెలియజేశారు.
టైటిల్ పాత్రను "ఆ ఒక్కడు" ఫేమ్ అజయ్ బాగా చేశాడని, ఎండలో చాలా కష్టపడ్డానని కణ్ణన్ చెప్పారు. మలయాళ నటి మధులిక పాత్రకు న్యాయం చేసిందని, సెప్టెంబరులో ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
దుబాయ్‌లో ఓ పాటను వచ్చేవారంలో తెరకెక్కిస్తున్నామని దర్శకుడు అన్నారు. యాక్షన్ ఫీల్ ఉన్న చిత్రమిదని, తన కెరీర్‌లో మంచి చిత్రమవుతుందని హీరో అజయ్ నమ్మకం వ్యక్తం చేశారు.