1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Akkineni Nageswara Rao

Nagarjuna Birth day | Akkineni Nageswara Rao | Hyderabad | Arogyashri | నాగార్జున బర్త్ డే: ఆరోగ్యశ్రీకి రూ.50 వేలు

నాగార్జున
WD
ప్రతి ఏడాది ఎంతో ఆర్భాటంగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు జరిగేది. కానీ ఈ ఏడాది మాత్రం ఎటువంటి ఆర్భాటం లేకుండా జరిగింది. ఆల్ ఇండియా నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు పి. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అక్కినేని నివాసంలో నాగార్జున జన్మదినోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా నాగార్జున కేక్ కట్ చేసి అభిమానులతో మాట్లాడారు. నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యాన్స్ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఆరోగ్యశ్రీ పథకానికిగాను 50 వేల రూపాయల విరాళాన్ని డీడీ రూపంలో అందించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పర్చా శరత్ కుమార్ కు స్వర్ణ కంకణం బహూకరణ జరిగింది.

ప్రతి ఏటా ఉత్తమ జర్నలిస్టు అవార్డును పుట్టినరోజు సందర్భంగా ఇవ్వాలని నాగ్ ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ సలహాదారు బొమ్మినేని శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT