1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Film

Josh | Film | Release | Nagarjuna | Naga Chaitanya | | సెప్టెంబరు 4కు "జోష్" చిత్రం వాయిదా!?

జోష్
File
FILE
యువసామ్రాట్ నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యను వెండి తెరకు పరిచయం చేస్తూ నిర్మించిన "జోష్" చిత్రం విడుదలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఈ చిత్రం గత నెలాఖరులో విడుదల కావాల్సి వుంది. అయితే, చిరంజీవి తనయుడు రాంచరణ్ నటించిన "మగధీర" విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం మెగా హిట్ కావడంతో "జోష్" చిత్రాన్ని వాయిదా వేయక తప్పలేదు.

ఆ తర్వాత ఆగస్టు 12వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. "మగధీర" టాక్ ముందు చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో విక్రమ్ హీరోగా నటించిన "కందస్వామి" చిత్రం ఈనెల 21వ తేదీన విడుదలైంది. అయితే, జోష్‌ను ఆగస్టు 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని భావించారు.

అనివార్య కారణాల రీత్యా చిత్రాన్ని సెప్టెంబరు మూడో తేదీకి వాయిదా వేశారు. కానీ, ఆ రోజున జంట నగరాల్లో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు జరుగనున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం సెలవును ప్రకటించింది.

ఫలితంగా.. "జోష్" మరోమారు వాయిదా పడి.. నాలుగో తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని నిర్మాత "దిల్" రాజు నిర్ణయించారు. కాగా, ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా ఒకనాటి అందాల నటి రాధ కుమార్తె కార్తిక హీరోయిన్‌గా నటిస్తోంది.
About Writer
SELVI.M