1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Socio Mythological

Sabari| Socio Mythological| Madhulika| Roopa Kaur| Rami Reddy| Konda Valasa| Shooting | సోషియో మైథిలాజికల్ చిత్రంగా "శబరి"

శబరి
"శబరి" అనే పేరుతో సోషియో మైథిలాజికల్ చిత్రం రూపొందుతోంది. నరసింహారెడ్డి, రవిచాట్ల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జయశేఖర్ కల్లు దర్శకత్వం వహిస్తున్నారు. 

ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభమైన ఈ చిత్రం నలభై రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా జరిగిన సింగిల్ షెడ్యూల్‌తో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లోని బూత్ బంగ్లాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. శబరి పాత్రను సాంఘిక పరంగా చేసి ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు. "శబరి" దర్శకుడిగా తనకు ఈ అవకాశం కల్పించిన నిర్మాతలకు జయశేఖర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే చిత్రాలను నిర్మించాలనే సంకల్పంతో వ్యాపారవేత్తలమైన తాము సి.ఎన్. ఆర్. ఫిలిమ్స్‌ సంస్థను ప్రారంభించామని అన్నారు. వైవిధ్యభరితమైన కథాకథనంతో కూడిన "శబరి" అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

సందర్భానుసారంగా ఉండే ఇందులోని ఐదుపాటలకు యువ సంగీత దర్శకుడు సుకుమార్ పి. రాజ్ అద్భుతమైన ట్యూన్స్ అందించారు. ఈ చిత్ర విజయంలో ఆడియో కీలక పాత్ర పోషిస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ చిత్రంలో రూపాకౌర్, మధులిక, రామిరెడ్డి, కొండవలస తదితరులు నటిస్తున్నారు. కెమెరా: కళ్యాణ్ సమి.
About Writer
SELVI.M