1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Babu Mohan

Udaya Babu| Babu Mohan| Sammakka Sarakka| Fights| Dance| Hero| Ganga | విజయదశమికి "ఉదయబాబు" రెండో చిత్రం

ఉదయబాబు
WD
ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ తనయుడు ఉదయబాబు హీరోగా రెండో చిత్రం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మొదటి చిత్రం "శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహాత్మ్యం" ద్వారా ఉదయబాబు ఫైట్స్, డ్యాన్స్‌లలోనే కాదు హీరో పాత్ర పోషణలో కూడా మంచి నటనను ప్రదర్శించిన విషయం తెలిసిందే.

అనిల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎడ్ల జోగిరెడ్డి, వి. సత్యనారాయణ గౌడ్‌లు నిర్మిస్తున్నారు. ఇంకా "గంగ" చిత్రానికి నాలుగు నంది అవార్డులు పొంది, ఉదయబాబు కథానాయకుడిగా పరిచయమైన సమ్మక్క సారక్క మహాత్మ్యం చిత్రానికి దర్శకత్వం వహించిన వేముగంటి ఈ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. వేముగంటి హార్డ్‌వర్క్‌ను, అతని ప్రతిభా పాటవాలను కొలమానంగా తీసుకుని ఈ చిత్రానికి దర్శకుడిగా నిర్ణయించుకున్నామని చెప్పారు. పూర్తి కమర్షియల్, మాస్ ఎలిమెంట్స్‌తో వీనులవిందైన సంగీత మేళవింపుతో ఉదయబాబు బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల నుంచి, అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందేలా వేముగంటి ఈ చిత్రం స్క్రిప్ట్ తయారు చేశారని వారు వెల్లడించారు.

సమ్మక్క సారక్క మహాత్మ్యంలో యంగ్ విలన్‌గా మంచిపేరు తెచ్చుకున్న గజిని ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారని, ఇంకా హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయాల్సి ఉందని నిర్మాతలు వెల్లడించారు. విజయదశమికి చిత్రం షూటింగ్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని వారు తెలిపారు.

ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎన్. సుధాకర్ రెడ్డి, సంగీతం: చక్రి.
About Writer
SELVI.M