YS Rajasekhara Reddy | Tollywood | Producers | Actors | Actresses | ముఖ్యమంత్రి క్షేమంగా తిరిగి వస్తారు: టాలీవుడ్
రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్షేమంగా తిరిగి వస్తారని టాలీవుడ్ ఆకాంక్షించింది. రేపు జరగాల్సిన సినీ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు పలు నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు సెప్టెంబరు 3న విడుదల కావాల్సిన జోష్ చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాత "దిల్" రాజు ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చిత్రాన్ని విడుదల చేయడం లేదని తెలిపారు.