YS Rajasekhara Reddy | AP Chief Minister | Tollywood | condolences | వై.ఎస్. లాంటి వ్యక్తి రాడు.. లేడు.. చలన చిత్రరంగం సంతాపం
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి దుర్మరణంపట్ల తెలుగు చలన చిత్ర రంగ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. అటువంటి నాయకుడు ఇక రాడనీ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి, డైరెక్టర్స్ అసోసియేషన్ గురువారంనాడు వెల్లడించిన ఈ ప్రకటనలో పేర్కొంటూ.. చలన చిత్ర రంగానికి ఎంతో మేలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదైతే, దాన్ని ప్రోత్సహించిన ఘనత వై.ఎస్.దని కీర్తించింది.
వై.ఎస్. కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. గురువారం జరగాల్సిన షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలయ్యేది ఇంకా నిర్ణయించలేదు. ఇండస్ట్రీలోని గ్రూపుల్లోని వారంతా వై.ఎస్. పట్ల సదభిప్రాయంతో తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.