YS Rajasekhara Reddy | Condolences | Film Industry | ముఖ్యమంత్రికి చలనచిత్ర రంగం అశ్రు నివాళి
FILE
బాధాతప్త హృదయంతో వైఎస్‌కు జోహార్లు అర్పించారు. సినీ పరిశ్రమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వైఎస్ చేసిన సేవను ఒక్కొక్కరు నెమరువేసుకున్నారు. డాక్టర్ డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావుతోపాటు పలువురు సీనియర్లంతా పాల్గొన్నారు.
చిత్రరంగానికి సంబంధించిన ఎటువంటి సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించేవారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే సినీ పరిశ్రమ కోరిక మేరకు శ్లాబ్ విధానాన్ని తొలగించి పరిశ్రమకు మేలు చేసిందన్నారు.