1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. birthday celebrations

Pawan Kalyan | birthday celebrations | Andhra Pradesh Chief Minister | Y.S. Rajasekhara Reddy | Komaram Puli | A.R. Rahman. | పుట్టినరోజు వేడుకలు వద్దన్న "కొమరం పులి"

పవన్ కల్యాణ్
WD
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబరు 2. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అదే రోజున మృతి చెందటంతో తన బర్త్‌డే వేడుకలను జరుపవద్దని పవన్ అభిమానులకు తెలియజేశారు.

38వ ఏటలోకి అడుగిడిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం "కొమరం పులి" చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఎస్.జె సూర్య ఈ చిత్రానికి దర్శకుడు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో లండన్ మోడల్ నికిష పవన్ కల్యాణ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబరులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT