1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Tanish

Manchivadu| Tanish| Bhama| Viswanath| Rajiv| Super good Films | "మంచివాడు" రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

మంచివాడు
WD
ఆణిముత్యాల్లాంటి పలు ఉత్తమ కథాచిత్రాల్ని అందించిన మెగాసూపర్ గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ పతాకంపై సునీల్ కథానాయకుడుగా "అందాలరాముడు" వంటి హిట్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు లక్ష్మీనారాయణ (దీప్తి)కి మరో అవకాశాన్ని ఇస్తూ యువ కథానాయకుడు తనీష్ హీరోగా అందరూ మెచ్చే కథతో "మంచివాడు" అనే చిత్రాన్ని అందిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 31 నుంచి చిలుకూరు సమీపంలోని ఓ గృహంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ.. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన సూపర్‌హిట్ చిత్రం "నచ్చావులే" ద్వారా కథానాయకుడిగా పరిచయమైన తనీష్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఇందులో తనీష్ ఉత్తమ గుణాలు కలిగిన మంచి కుర్రాడుగా నటిస్తున్నాడు. అతని సరసన నటించేందుకు "భామ"ని ఎంపిక చేశామన్నారు.

నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ "మంచివాడు" గురించి చెబుతూ.. తమ సూపర్‌గుడ్ సంస్థలో హిట్ చిత్రాన్ని చేసిన దీప్తికి మళ్లీ అవకాశాన్ని ఇస్తూ "మంచివాడు"ను నిర్మిస్తున్నామన్నారు.

మరో నిర్మాత పారస్‌జైన్ మాట్లాడుతూ.. ఇంటల్లిపాది మెచ్చే ఓ మంచికథతో మంచివాడుని ప్లాన్ చేశామని, సెప్టెంబర్ 20వరకు సింగిల్ షెడ్యూల్తో సినిమాను పూర్తి చేస్తామని తెలిపారు.

తనీష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో భామ కథానాయికగా నటిస్తోండగా, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. చంద్రమోహన్, వేణుమాధవ్, రఘుబాబు, కోవైసరళ, సుధ, క్రాంతి, దేవిశ్రీ మరియు సంగీత దర్శకుడు కోటి తనయుడు అయిన రాజీవ్ మరో ప్రధాన పాత్రను చేస్తున్నాడు.

గంగోత్రి విశ్వనాథ్ సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి గీత రచయితలు: ఇ.ఎస్.మూర్తి, అభినవ శ్రీనివాస్, సంగీతం: శిల్పి, ఛాయాగ్రహణం: వేణుగోపాల్, ఎడిటింగ్: నందమూరి హరి, కళ: కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: కె. ఉమామహేష్, జె. రాధాకృష్ణ, మేనేజర్స్: బి. అశోక్. నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్, సమర్పణ: ఆర్.బి. చౌదరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. లక్ష్మీనారాయణ (దీప్తి).
About Writer
SELVI.M