1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Kanchivaram

Prakash Raj| Kanchivaram| Shreya reddy| National Best Actor Award| Priyadarshan | ప్రకాష్ రాజ్‌తో "కాంజీవరం"లో నటించడం హ్యాపీగా ఉంది!

ప్రకాష్ రాజ్
WD
తమిళచిత్రం "కాంజీవరం" నటనకుగాను ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ జాతీయ ఉత్తమనటుడు అవార్డును ఎంపికయిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ నేపథ్యంలో "కాంజీవరం" చిత్రంలో అద్భుతంగా నటించిన ప్రకాష్ రాజ్‌కు జాతీయ అవార్డు లభించడంపై సుప్రసిద్ధ నటి, నిర్మాత విక్రమ్‌కృష్ణకు శ్రీమతి అయిన శ్రీయారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

అంతేగాకుండా.. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ సరసన నటించడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీయారెడ్డి అన్నారు. ఒక సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని "కాంజీవరం" అనే పేరిట దర్శకుడు ప్రియదర్శన్ ఓ అద్భుత చిత్రంగా తీర్చిదిద్దారని ఆమె ప్రశంసించారు.

రొటీన్ చిత్రాలకు భిన్నంగా, మనకు స్వాతంత్ర్యం రావడానికి పూర్వం "కాంజీవరం"లో జరిగిన అలనాటి చరిత్రలోని కథను ప్రియదర్శన్ అద్భుతంగా తెరకెక్కించారని శ్రీయారెడ్డి కొనియాడారు. ఇంకా కాంజీవరంలో అపూర్వమైన స్థాయిలో సహజత్వానికి పెద్దపీట వేశారని ఆమె తెలిపారు.

షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒక మంచి సినిమాలో నటిస్తున్నాననే భావన తనలో కలిగిందని, నిజంగా ఈ చిత్రంలోని ప్రకాష్ రాజ్ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని శ్రీయారెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా నటుడు ప్రకాష్ రాజ్‌కు హర్ధిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని శ్రీయారెడ్డి చెప్పారు. ఆ విధంగానే "కాంజీవరం"ని సహజత్వానితి దగ్గరగా అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకులు ప్రియదర్శన్‌కు అభినందనలు తెలుపుతున్నానని ఆమె చెప్పారు.
About Writer
SELVI.M