1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Varun Sandesh

Kurradu| Varun Sandesh| Neha Sharma| Puri Jagannath| Magadheera| Ramcharan| Chirutha | "చిరుత"కు కుర్రాడు అనే టైటిల్ పెట్టాలనుకున్నాం: పూరి

"కుర్రాడు" రీమిక్స్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన "పూరి"!

కుర్రాడు
WD
'రామ్‌చరణ్‌తేజ నటించిన తొలి చిత్రానికి "కుర్రాడు" అని టైటిల్‌పెట్టి.. "లోక్లాస్" అనే కాప్షన్ పెట్టాలనుకున్నాం.

కానీ మెగాస్టార్ చిరంజీవి తనయుడు లోక్లాస్‌కాలేడు. చూడ్డానికి హైక్లాస్‌లా ఉన్నాడు. ఆ తర్వాత చరణ్ తొలి చిత్రానికి "చిరుత" అనే టైటిల్ పెట్టామని' దర్శకుడు పూరి జగన్నాథ్ తన మనసులోని మాటను వెల్లడించారు.

వరుణ్, నేహాశర్మ నటించిన "కుర్రాడు" ఆడియో కార్యక్రమంలో పూరి మాట్లాడారు. గతంలో కమల్‌హాసన్ నటించిన "అందమైన అనుభవం" చిత్రంలోని "కుర్రాళ్ళు కుర్రాళ్లు.." అనే పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌గా జొప్పించారు. ఈ పాటకు పూరి లయబద్ధంగా డ్యాన్స్ చేయడం విశేషం.

వరుణ్‌సందేశ్, నేహాశర్మ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ నిర్మిస్తోన్న "కుర్రాడు" చిత్రం ఆడియో విడుదల గురువారం మధ్యాహ్నం ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్యఅతిథి మగధీర హీరో రామ్‌చరణ్ తేజ ఆడియోను విడుదల చేసి డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్‌కు అందజేశారు. ఆడియో సీడీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేసి కీరవాణికి అందించారు.

ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ సందేశ్ తాను అమెరికాలో "మరోచరిత్ర" షూటింగ్‌లో ఉండడం వల్ల రాలేకపోతున్నాననే సందేశాన్ని వినిపించారు. సంగీత దర్శకుడు అచ్చు మ్యూజిక్‌ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నట్లు వరుణ్ చెప్పారు.

ముఖ్యఅతిథి రామ్‌చరణ్‌తేజ మాట్లాడుతూ.. దర్శకుడు సందీప్‌తో చాలా పరిచయముందన్నారు. దర్శకత్వంపై యు.ఎస్‌.లో శిక్షణ తీసుకుంటున్నానని సందీప్ చెప్పారు. దాంతో ఇక్కడకు రారేమోనని అనుకున్నాను. అయితే ఆనంది ఆర్ట్స్ సందీప్‌ను దర్శకుడిగా చూపించిందని రామ్‌చరణ్ అన్నారు.

మంచి టాలెంట్ ఉన్న సందీప్ దర్శకత్వంలో వరుణ్ సందేశ్ తొలిసారిగా యాక్షన్ చేస్తున్న చిత్రమిదని రామ్‌చరణ్ గుర్తు చేశారు.
ఇకపోతే.. కథానాయిక నేహాశర్మ తన తొలిచిత్రం చిరుతలో నటించిందని, ఇందులోని పాటలన్నీ బాగుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.

చిత్ర దర్శకుడు, గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్ గుణ్ణం మాట్లాడుతూ.. ఈ సినిమాకు ముగ్గురు హీరోలు. ఒకరు సంగీత దర్శకుడు అచ్చు. మరొకరు రచయిత అనంతశ్రీరామ్, మూడోహీరో.. ఈ సినిమా నిర్మాణానికి ముందుకొచ్చిన కిరణ్. ఈ ముగ్గురి సహకారంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం తనకు దక్కిందని సందీప్ అన్నారు.

కోటి మాట్లాడుతూ.. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌడ్ మ్యూజిక్ అందించాను. వరుణ్ మాస్‌హీరోగా బాగా చేశాడని కితాబిచ్చారు. సంగీతదర్శకుడు రాజామణి అబ్బాయే అచ్చు అని, ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

కీరవాణి మాట్లాడుతూ.. తాను రాజామణి శిష్యుడిని, ఆయన కుమారుడు సంగీతం వహించిన కుర్రాడు సినిమా పాటలు తప్పకుండా హిట్ అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
About Writer
SELVI.M