1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dasari Narayana Rao

Young India| Dasari Narayana Rao| Songs| Recording| Keeravani | "యంగ్ ఇండియా" పాటల రికార్డింగ్ ప్రారంభం

యంగ్ ఇండియా
WD
దర్శకరత్న డా. దాసరి నారాయణరావు అంతా కొత్తవారితో తీయనున్న చిత్రం యంగ్ ఇండియాకు సంబంధించి పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని గురువారం ప్రసాద్‌ల్యాబ్స్ థియేటర్‌లో ప్రారంభించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

ఇకపోతే.. దాసరి, కీరవాణి కాంబినేషన్‌లో చాలాకాలం తర్వాత వస్తోన్న చిత్రమిది. ఇందులో ఆరు పాటలుంటాయని, 20లోగా రికార్డింగ్ పూర్తవుతుందని దాసరి పేర్తొన్నారు.

ఈ సినిమాలో అంతా కొత్తవారిని పరిచయం చేయనున్నారు. రోజుకు 25మందిని ఎంపికచేసే ప్రక్రియకు కూడా గురువారం నాడే శ్రీకారం చుట్టారు. త్వరలో దిబెస్ట్ వివరాలను ప్రకటించనున్నట్లు దాసరి వెల్లడించారు.
About Writer
SELVI.M