Samardhudu, Raja, Sanjana, Y.S. RajaSekhara Reddy, Political Leader, Krishnam Raju | వైఎస్సారే నిజమైన రాజకీయనాయకుడు: రాజా
FILE
తాజాగా తాను హీరోగా నటిస్తోన్న "సమర్థుడు" చిత్రాన్ని నాయకత్వ లక్షణాలను కూడిన కథతో రూపొందించినట్లు రాజా తెలిపారు. సంజన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 18వ తేదీన విడుదల కానుందని చెప్పారు.
WD
సమర్థుడు గురించి గురువారం రాజా మాట్లాడుతూ.. ఈనాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రముంటుందని, చక్కని సందేశం కూడా ఇందులో ఉందన్నారు.
దర్శకుడు అర్జున్ రెడ్డి సందేశాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారని రాజా తెలిపారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రంలో రాజకీయనాయకుడిగా నటించాడని, ఆయనకు వ్యతిరేకంగా తాను నటించానన్నారు.