1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ninnu kalisaka

Usha Kiran Movies| Ninnu kalisaka| Audio| Release| Ramoji Rao| Eenadu | ఉషాకిరణ్ మూవీస్ "నిన్ను కలిశాక" ఆడియో విడుదల

ఉషాకిరణ్ మూవీస్
WD
ఉషాకిరణ్‌మూవీస్ నూతన కథానాయికలను పరిచయం చేస్తూ "నిన్ను కలిశాక" పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. శివనాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సంతోష్, చైతన్య, ప్రియ, డిపాషాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే.. ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మిస్తోన్న 83వ చిత్రమిది.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం గురువారం ఉదయం రామోజీ ఫిలింసిటీలో కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఛైర్మన్ రామోజీరావు సీడీ, ఆడియోలను విడుదల చేసి దర్శకుడు శివనాగేశ్వర రావుకు అందజేశారు. ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న సంగీతదర్శకుడు సునీల్ కౌశ్యప్‌కు హీరోహీరోయిన్లకు రామోజీరావు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఫిలింసిటీ ఎం.డి. రామ్మోహనరావు, ఈనాడు ఎం.డి. కిరణ్, కె.బాపినీడు, జనరల్‌మేనేజర్ సుధాకర్, అజయ్ శాంతి తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా: బి.ఎల్. సంజయ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివనాగేశ్వర రావు.
About Writer
SELVI.M