1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Y.S. Jagan

Y.S.Rajasekhara Reddy| Y.S. Jagan| Rajasekar| Loka Nayakudu| Sonia Gandhi | విలేకరులూ చూడండి... ఇదిగో జగన్‌కు మద్దతుగా ఫ్యాక్స్: రాజశేఖర్

వైఎస్ రాజశేఖర రెడ్డి
FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిపై "లోకనాయకుడు" చిత్రాన్ని తీస్తున్నట్లు హీరో రాజశేఖర్ ఇటీవలే ప్రకటించారు. ఆ చిత్రాన్ని ఇప్పుడే నిర్మించడం లేదని, అయినా ఇది సరైన సందర్భం కాదని చెప్పారు. ప్రస్తుతం వేరే రెండు చిత్రాల్లో బిజీగా ఉన్నానని గురువారం మధ్యాహ్నం ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.

ముఖ్యంగా గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో.. వై.ఎస్. జగన్‌కు మద్దతు తెలిపేందుకే విలేకరులను పిలిచినట్లు రాజశేఖర్ స్పష్టం చేశారు. జగన్‌ను సీఎంగా చూడాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా ఆకాంక్షకూడా అదేనని ఆయన అన్నారు.

తమ కోరిక నెరవేరాలని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీని స్వయంగా కలిసి తెలియజేయాలనుకున్నామని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఆమె అపాంట్‌మెంట్ సాధ్యంకాదని చాలామంది సలహా ఇచ్చారు. దీంతో నిన్న అంటే బుధవారం సోనియాగాంధీకి ఫ్యాక్స్ చేశామని.. ఆ ఫ్యాక్స్‌ను రాజశేఖర్ ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT