Ganesh| Cinema| Audio| NTR| Kajal Agarwal | ఎన్టీఆర్‌చే రామ్ "గణేష్" ఆడియో విడుదల
WD
ఈ చిత్రం ఆడియో క్యాసెట్లను యువకథానాయకుడు ఎన్టీఆర్ ఆవిష్కరించి తొలి క్యాసెట్‌ను కోటికి అందించారు. ఆడియో సీడీని డి.సురేష్‌బాబు ఆవిష్కరించి దిల్‌రాజుకు అందించారు.
మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
ఈ కార్యక్రమంలో స్రవంతి రవికిషోర్, రామ్, శరవణన్, బి. గోపాల్, మిక్కీ జె. మేయర్, డాక్టర్ కె. ఎల్. నారాయణ, హరి అనుమోలు, రామజోగయ్య శాస్త్రి, దయానంద్ మహేష్ కుమార్ మండపల్లి తదితరులు పాల్గొన్నారు.
WD
ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. సబ్జెక్ట్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే రవికిషోర్ చక్కని కథతో ఈ చిత్రాన్ని రూపొందించారన్నారు. ఉత్తమాభిరుచి ఉన్న నిర్మాత రవికిషోర్ మంచి క్వాలిటీతో గణేష్‌ను నిర్మించడానికి తపనపడ్డారని బి.గోపాల్ చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. తాము నిర్మించిన గణేష్ చిత్రం కంటే ఈ గణేష్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని డి. సురేష్ బాబు అన్నారు. రవికిషోర్ నిర్మించిన "యువసేన" తన మొదటి చిత్రమని, "గణేష్"లో తాను ఐదు పాటలు రాశానని రామజోగయ్యశాస్త్రి తెలిపారు.
దర్శకుడు శరవణన్ మాట్లాడుతూ.. యూనిట్ సహకారంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గణేష్‌ను తెరకెక్కించామన్నారు.
సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా పాటల చిత్రీకరణను స్విట్జర్లాండ్‌కు వెళ్లి తిలకించే అవకాశం తనకు కలిగిందని, వైవిధ్యమైన సంగీతాన్ని అందించడానికి కృషి చేశానని తెలిపారు.
ముఖ్యఅతిథి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కథానాయకుడిగా అన్ని క్వాలిటీలు ఉన్న రామ్ ఈ సినిమాలో ధరించి గెటప్ బాగుందని కితాబిచ్చారు. గెటప్ లాగానే సినిమా కూడా బాగుంటుందని భావిస్తున్నానని, రవికిషోర్‌కి, రామ్‌కి మరో "రెడీ" కావాలని ఎన్టీఆర్ తెలిపారు.
రామ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పిల్లలతో కలిసి నటించడం జీవితకాలపు మధురానుభూతిని కలిగించిందని, దర్శకుడు చాలా కొత్తగా సినిమాను రూపొందించారని వెల్లడించారు. టైటిల్ పాతగా ఉన్నా సినిమా కొత్తగా ఉంటుందని, ఈ సినిమా ఆడియో విన్న తర్వాతే తాను మిక్కీ జె. మేయర్ ఫ్యాన్‌ని అయ్యానని చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో అన్ని తరహాల పాటలున్నాయని, రామజోగయ్యశాస్త్రికి రచయితగా ఎంతో సహకరించిన అబ్బూరి రవికి, పెదనాన్న రవికిషోర్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు రామ్ వెల్లడించారు.