Anand Babu| Director| Heart Attack| Na Pellam Na istam | ప్రముఖ తెలుగు దర్శకుడు ఆనంద్ బాబు మృతి
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఆనంద్ బాబు గుండెపోటుతో మరణించారు. నా పెళ్లాం నా ఇష్టం, శ్రీదేవి నర్సింగ్ హోమ్, హరిహర శంభో, కార్తీక మాసం, సూపర్ ఎక్స్‌ప్రెస్ వంటి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన శనివారం హైదరాబాదులో కన్నుమూశారని ఆయన కుటుంబీకులు తెలిపారు.
ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే సినిమాలను రూపొందించే ఆనందబాబు మృతి చెందారన్న వార్త వినగానే తెలుగు సినీ రంగం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి సినీరంగం సంతాపం వ్యక్తం చేసింది.
ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే సినిమాలను రూపొందించే ఆనందబాబు మృతి చెందారన్న వార్త వినగానే తెలుగు సినీ రంగం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి సినీరంగం సంతాపం వ్యక్తం చేసింది.