1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Anupoorva

Ram Tej| Anupoorva| Cinema| Goldfish Entertainments| Gold Nandi Award | 70 శాతం పూర్తయిన రామ్‌తేజ్, అనుపూర్వల చిత్రం

రామ్తేజ్
WD
గోల్డ్‌ఫిష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బంగారునంది అవార్డు గ్రహీత రామ్‌తేజ్ హీరోగా, అనుపూర్వ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 70 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

రవిశర్మ దర్శకత్వంలో సుధీర్ తుములూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.ఎ. రాజ్‌కుమార్ సంగీతం సమకూర్చారు.

ఈ నెల 15 నుంచి రికార్డింగ్ జరుపుకోనున్న పాటలకు చంద్రబోస్ చక్కటి సాహిత్యాన్ని అందించారని చిత్ర సహనిర్మాత నాగులాపల్లి పద్మిని తెలియజేశారు. అలాగే ఈ నెలాఖరునుంచి నిర్విరామంగా జరిగే చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని, త్వరలో టైటిల్‌ను ఖరారు చేస్తామని దర్శకుడు తెలిపారు.

ఇంకా భానుచందర్, సుమన్‌శెట్టి, గుండుహనుమంతరావు, జోగినాయుడు తదితరులు నటించిన ఈ సినిమాకు కథ, మాటలు: మనోహర్, కెమెరా: మహేష్ రాయల్, నిర్మాత: సుధీర్ తూములూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవిశర్మ.
About Writer
SELVI.M