National Awards| B.N. Reddy| Chakrapani| Nagi Reddy| AP Government | బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి పేరిట జాతీయస్థాయి అవార్డులు
తెలుగు చలన చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి విశేషంగా కృషిచేసిన బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి పేరిట జాతీయస్థాయి అవార్డులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది.
దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గత ఏడాది, నవంబర్ 16న నంది అవార్డు ప్రదానోత్సవ సభలో ప్రకటించిన మేరకు ఈ అవార్డులను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇటీవలే ఐదుగురు సభ్యుల కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వాటి ఆధారంగా శుక్రవారంనాడు జి.ఓ. ఎం.ఎస్.నెం. 438ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ జాతీయ అవార్డులకు ఎంపికయ్యే వ్యక్తులకు రెండు లక్షల నగదు బహుమతి, ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య అవార్డును ఇకపై "రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు"గా వ్యవహరిస్తారు. దీనికింద రెండు లక్షల నగదు, ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.
అలాగే ప్రతిభా రాజీవ్ పురస్కారాలకు గతంలో ఉన్ననగదు బహుమతిని 50వేల నుంచి లక్షకు పెంచారు. ఈ అవార్డులను వివిధ రంగాల్లో అంటే.. సాహిత్యం, లలితకళలు, శాస్త్రీయం, సాంఘిక సేవా, క్రీడలు వంటి రంగాలకు చెందిన వారికి కేటాయించారు. అలాగే ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని ప్రతియేటా జనవరిలో నంది నాటకోత్సవాల్లో ఇస్తారు.